TSPSC బోర్డు సభ్యులపై అద్దంకి దయాకర్ సీరియస్

by Disha Web Desk 2 |
TSPSC బోర్డు సభ్యులపై అద్దంకి దయాకర్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్​పీఎస్సీ కుళ్లిపోయిందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​విమర్శించారు. ఒక్క నోటిఫికేషన్‌ను కూడా సక్రమంగా పూర్తి చేయలేని పరిస్థితుల్లో బోర్డు ఉండటం దారుణమన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-2 వాయిదా వేయడంలో ఇబ్బందులు లేవన్నారు. గ్రూప్-2 వాయిదా వేయాలని 6 లక్షల మంది విద్యార్థులు రోడ్డెక్కారన్నారు. విద్యార్థులంతా పరీక్షలను కేవలం వాయిదా వేయాలని కోరుతున్నారని, కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు.

సమస్యను పరిష్కరించాలని టీఏస్ పీఎస్సీకి 48 గంటల సమయం ఇచ్చామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమన్నారు. ఆఫ్​లైన్ ఎగ్జామ్‌లకు ఇబ్బందులు లేకపోయినా.. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పరీక్ష వాయిదా వేయకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. విద్యార్థులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ నేతలను అరెస్టులు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం అక్రమ అరెస్టులను ఆపాలని కోరారు.


Next Story

Most Viewed