తెలంగాణలో ఓటు విలువ రూ.6 వేలు: అద్దంకి దయాకర్

by Disha Web Desk 2 |
తెలంగాణలో ఓటు విలువ రూ.6 వేలు: అద్దంకి దయాకర్
X

దిశ, ప్రతినిధి నిర్మల్: రాష్ట్రంలో రాజకీయాలను అత్యంత ఖరీదుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కిందని, ప్రస్తుతం ఒక్కో ఓటు విలువ రూ.6000 ఉందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని ప్రైవేటు హోటల్లో దయాకర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ దుర్గంధ భరితంగా మార్చారని ఆరోపించారు. కేడర్ బలంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ డబ్బులను నమ్ముకోవడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌కు దళితులపై ప్రేమ లేదని ప్రతిక్షణం ప్రేమ ఉన్నట్లు కపట నాటకం ప్రదర్శిస్తారని విమర్శించారు.

అంబేద్కర్ భారీ విగ్రహం పెట్టినంతమాత్రాన దళితుల ఓట్లు ఆయనకు పడుతాయనుకోవడం మూర్ఖత్వమే అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్‌లోకి భారీ చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఆనంద్ రావు పటేల్, రాజేశ్వర్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరు?

Next Story