BREAKING: CM ఎంపికపై ముగిసిన కీలక భేటీ.. ఇవాళ సాయంత్రం ప్రకటన

by Satheesh |
BREAKING: CM ఎంపికపై ముగిసిన కీలక భేటీ.. ఇవాళ సాయంత్రం ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇంట్లో నిర్వహించిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో సీఎం అభ్యర్థి పేరును మల్లికార్జున ఖర్గే ఫిక్స్ చేశారు. దీంతో డీకే శివకుమార్, మాణిక్ రావు థాక్రే, కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ బయలుదేరారు. ఇవాళ సాయంత్రం వీరు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అనంతరం తెలంగాణ సీఎం అభ్యర్థి పేరును ప్రకటించనున్నారు. కాగా, సీఎం ఎంపిక బాధ్యతను తెలంగాణ సీఎల్పీ అధిష్టానానికి అప్పగిస్తూ సోమవారం ఏక వాక్య తీర్మానం చేసింది. ఏఐసీసీ ఇంచార్జ్ డీకే శివకుమార్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. ఇవాళ ఖర్గే నివాసంలో జరిగిన భేటీలో సీఎల్పీ తీర్మానాన్ని ఖర్గేకు ఆయన అందించారు. దీనిపై రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఖర్గే చర్చలు జరిపి సీఎం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను కంప్లీట్ చేశారు. సీఎం పేరును సీల్డ్ కవర్‌లో తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్‌లకు అప్పగించారు. ఇవాళ సాయంత్రం సీఎం పేరును వీరు అధికారికంగా ప్రకటించనున్నారు.

Next Story

Most Viewed