టీ-కాంగ్రెస్ ఆశావహులు కొత్త రాగం.. 40 నియోజకవర్గాల్లో రీ సర్వే..?

by Disha Web Desk 19 |
టీ-కాంగ్రెస్ ఆశావహులు కొత్త రాగం.. 40 నియోజకవర్గాల్లో రీ సర్వే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపిక మరింత జాప్యం కానున్నది. పార్టీ నిర్వహించిన సర్వేలపై సందేహలున్నాయని పలువురు ఆశావహులు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఎక్కువ మంది పోటీ చేసే నియోజకవర్గాల నుంచి ఇలాంటి కంప్లైట్స్ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35 నుంచి 40 నియోజకవర్గాల్లో రీ సర్వే చేయాలని హైకమాండ్‌ను కోరారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో థాక్రే, పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు కూడా ఈ మీటింగ్‌లో పాల్గొనడం గమనార్హం.

ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ నెల 8 లోపు మరోసారి ఫిర్యాదులు వస్తున్న నియోజకవర్గాల్లో రీ సర్వే చేయాలని థాక్రే సునీల్‌కు సూచించారు. ఆ నివేదికను వెంటనే సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సూచించనున్నారు. ఇక పార్టీ వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతానికి 62 నియోజకవర్గాలపై ఢిల్లీ, రాష్ట్ర పార్టీలో అభ్యర్ధుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరగా.. రీ సర్వే తర్వాత మరో 40 సెగ్మెంట్లు ఫైనల్ కానున్నాయి. అయితే ఈ నెల 8న ఢిల్లీలో జరిగే స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ లిస్టు రిలీజ్ కానున్నది.

Next Story