- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
మున్సిపల్ శాఖకు అవార్డు..వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండింగ్ జోన్‌లు ఏర్పాటుపై అభినందన

దిశ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ శాఖకు అవార్డు వచ్చింది. వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో అగ్రభాగాన నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హిర్దిప్ సింగ్ పూరి చేతుల మీదుగా తెలంగాణ ప్రభుత్వం తరుఫున మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, మెప్మా ప్రాజెక్టు మేనేజర్ చైతన్య అవార్డును అందుకున్నారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇచ్చే పీఎంస్వాన్ నిధి ప్రారంభించి మూడేళ్లు అయిన సందర్భంగా గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందజేశారు. రాష్ట్ర అధికారులను కేంద్ర మంత్రి అభినందించారు. దేశంలో పెద్ద రాష్ట్రాల కేటగిరిలో తెలంగాణ, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు అవార్డులను అందించారు. వీధి వ్యాపారులకు ఇచ్చే రుణాలపై స్టాంప్ డ్యూటీని దేశంలోనే తెలంగాణ మినహాయించింది. వీధి వ్యాపారులకు మొదటి విడతలో ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున రుణం అందజేశారు. మొదటి విడతలో 3.40లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో 3,58,776 (106శాతం) వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు కాగా 3,56,678 మందికి రూ.353.17(105శాతం) కోట్లు పంపిణీ చేశారు. మొదటి విడత రుణాల పంపిణీలో 100 శాతం లక్ష్యాన్ని చేరి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
రెండో విడత రుణాల పంపిణీలో భాగంగా మొదటి విడత రుణాన్ని తిరిగి చెల్లించిన వారికి ఒక్కొక్క వీధి వ్యాపారికి రూ.20వేలు అందించారు. 1,45,100 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 1,53,306 మందికి(106శాతం) మంజూరు చేశారు. ఇందులో 1,46,692 (101శాతం) రుణాలను పంపిణీ చేశారు. మూడో విడత రుణాల్లో భాగంగా 20వేల రుణాన్ని తీసుకొని చెల్లించిన వారికి రూ.50వేలను మూడోవిడతలో అందించారు. 3870 మందికి రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా 10661 మందికి(275శాతం) రుణాలు మంజూరు చేశారు. 10058(260శాతం) మందికి రూ.49.64కోట్లు పంపిణీ చేశారు. వీధి వ్యాపారులకు మూడు విడుతల్లో ఇప్పటి వరకు రూ.695.42కోట్ల ను పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ రుణాలు చెల్లించిన వారికి తిరిగి వారికి ఆ రుణాన్ని బ్యాంకులు వారి అకౌంట్లో జమ చేయగా, ఇలా తెలంగాణలోని వీధి వ్యాపారులకు రూ.10.70కోట్లు జమ అయినట్లు అధికారు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వీధి వ్యాపారులకు పట్టణ ప్రగతిలో రుణాలు అందించడమే కాదు వారు వ్యాపారాలు చేసుకోవడానికి అనువుగా స్ట్రీట్ వెండింగ్ జోన్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 2676 స్ట్రీట్ వెండింగ్ షెడ్స్ నిర్మించాలని నిర్ణయించగా, ఇందులో 1294 పూర్తి కాగా, 1382 నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.