BRS రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. మండలి చైర్మన్‌కు ఫిర్యాదు

by GSrikanth |
BRS రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. మండలి చైర్మన్‌కు ఫిర్యాదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూసుకుంట్ల దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కోరారు. బజూబ్లీహిల్స్‌లోని నివాసంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి శుక్రవారం పిటిషన్ అందజేశారు. పిటిషన్‌తో పాటు పలు ఆధారాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, యాదవ రెడ్డి, శేరి శుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ మారిన దామోదర్ రెడ్డి, మహేందర్ రెడ్డిలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంగించిన వారిని ఉపేక్షించబోమన్నారు. పిటిషన్‌పై చైర్మన్ సానుకూలంగా స్పందించి ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తారని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం.రమేష్ రెడ్డి ఉన్నారు.

Next Story