సీఎం కీలక నిర్ణయం.. పథకాల అమలుకు ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీలు

by Mahesh |
సీఎం కీలక నిర్ణయం.. పథకాల అమలుకు ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కమిటీలు
X

దిశ, వెబ్ డెస్క్: చేవెళ్ల లో జరిగిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సచివాలయంలో రెండు పథకాలను అధికారికంగా ప్రారంభించిన తర్వాత సాయంత్రం చేవెళ్లలో నిర్వహించిన సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రావడానికి కృషి చేసిన ప్రతి పథకాన్ని కచ్చితంగా అమలు చేసి చూపుతామని మరోసారి స్పష్టం చేశారు. అలాగే ఉమ్మడి పది జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను నియమించామని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా.. పథకాలను పటిష్ఠంగా అమలు చేయడం కోసం.. ఇందిరా కమిటీలను ఏర్పాటు చేయాలని పలువురు సూచించారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రతి గ్రామంలోని ప్రజలు ఇంచార్జి మంత్రులను కలిసి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోరమని అన్నారు. అలా చేస్తూ.. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఐదుగురిని ఎంపిక చేసీ ప్రతి గ్రామంలో.. ఇందిరమ్మ కమిటీ పేరుతో పథకాలను అర్హులకు పటిష్టంగా అమలు జరిగే విధంగా చూడవచ్చని సీఎం రేవంత్ రెడ్డి సభలో మాట్లాడారు.



Next Story

Most Viewed