సీఎం పిలిస్తే వెళ్లకుండా ఎందుకుంటా: సీఎండీ ప్రభాకర్ రావు

by Disha Web Desk 2 |
సీఎం పిలిస్తే వెళ్లకుండా ఎందుకుంటా: సీఎండీ ప్రభాకర్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్రటేరియట్‌లో జరిగిన విద్యుత్ శాఖపై రివ్యూకు సంబంధించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటానని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ శాఖ నుంచి కానీ, సీఎంవో నుంచి కానీ తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. తనకి ఆహ్వానం అంది ఉంటే కచ్చితంగా సమావేశానికి హాజరయ్యే వాడినని స్పష్టం చేశారు.

Next Story