KCR చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చా: CM రేవంత్ సెటైర్

by Satheesh |
KCR చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చా: CM రేవంత్ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇద్దామని ఇన్నాళ్లు ఆగామని.. ఇకపై కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ వేదికగా కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చి వచ్చానని.. కానీ ఆయన సభకు రాలేదని సెటైర్ వేశారు. ఎన్నికలు అయిపోయాయని.. ఇకపై ప్రతి దాన్ని రాజకీయం చేయకుండా ప్రతిపక్షంగా మీ పాత్రను నిర్వర్తించండని బీఆర్ఎస్‌కు సూచన చేశారు.

ఇక, ముచ్చర్లలో నాలుగో నగరాన్ని నిర్మిస్తు్న్నామని, మన భవిష్యత్ నగరంగా ముచ్చర్ల కాబోతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కడి వరకు మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఐటీ, ఎక్సైజ్ పాలసీలు తీసుకొస్తామని చెప్పారు. ముచ్చర్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ హబ్ రూపొందించాలకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చే పాలసీలపై ప్రతిపక్షం సహేతుకమైన సలహాలిస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story