హర్యానాలో ఆప్ చేసిందే.. ఢిల్లీలో కాంగ్రెస్ చేసింది: సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
హర్యానాలో ఆప్ చేసిందే.. ఢిల్లీలో కాంగ్రెస్ చేసింది: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఘోర పరాజయం (AAP party is a big defeat) పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన ఆప్ పార్టీ (AAP party)కేవలం 22 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే 48 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ అధికారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ (Former CM Kejriwal), డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పలువురు కీలక నేతలు ఓటమి చెందారు. కాగా ఈ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ప్రస్తుతం ఆయన కేరళలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ (Matrubhumi International Festival)లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆప్ పార్టీ (AAP party)హర్యానా ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టింది. మేము ఈ ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఆప్ పార్టీని దెబ్బ కొట్టాము. దీంతో రెండు ప్రాంతాల్లో బీజేపీకి లాభం (Profit for BJP) చేకూరింది అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. డీలిమిటేషన్ ప్రక్రియను సరైన పద్ధతిలో చేయాలని కోరారు.

అలా చెయ్యకపోతే బీమారు రాష్ట్రాలు అయిన బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని.. సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. అలాగే పీవీ నరసింహరావుకు కాంగ్రెస్ పార్టీ (Congress party)అన్యాయం చేసింది అనేది అబద్దం అని అన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని.. దానికి తానే సాక్ష్యమని అన్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, జైపాల్ రెడ్డి లకు కాంగ్రెస్ పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని, నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి చేసిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement
Next Story