బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విషెస్

by Mahesh |   ( Updated:2025-04-15 05:50:11.0  )
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విషెస్
X

దిశ, వెబ్ డెస్ : ఈ రోజు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పుట్టినరోజు (MLA Raja Singh's birthday) సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విష్ చేశారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ సీఎంవో అఫీషియల్ ఎక్స్(Twitter) అకౌంట్ ద్వారా.. ఇలా ట్వీట్ చేశారు. గోషామహల్ శాసనసభ్యులు టి. రాజా సింగ్ జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్న మవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు." ఎమ్మెల్యే రాజా సింగ్ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డుల్లోకి ఎక్కారు.

అలాగే ఆయన హిందువులు, గోవుల రక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతూ.. అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎంతో మంది యువ అభిమానులు ఉన్నారు. ఆయన ఒక్క పిలుపుతో వేలాది మంది యువకులు సొంత ఖర్చులతో ర్యాలీలో పాల్గోంటారు. ఇటీవల కాలంలో రాజాసింగ్ తన నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వంచే నిర్వహించే ప్రతి అధికారిక కార్యక్రమంలో పాల్గొంటూ నియోజకవర్గ ప్రజలకు అన్ని పథకాలు అందేలా చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

Next Story

Most Viewed