నేడు 8 రోజుల జపాన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
నేడు 8 రోజుల జపాన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పెట్టుబడులే లక్ష్యంగా.. 8 రోజుల జపాన్ పర్యటన (trip to Japan)కు వెళ్లనున్నారు. ఈ రోజు సీఎల్పీ సమావేశం అనంతరం అన్ని పనులు ముగించుకొని సీఎం జపాన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో సీఎం తో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు వెళ్లనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం జపాన్ పర్యటన కొనసాగనుంది. అలాగే ఒసాకాలో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్‌పో (Industrial Expo) లో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. అనంతరం టోక్యోలో పెట్టుబడులపై పలు పారిశ్రామికవేత్తలతో సమావేశం (Meeting with industrialists) జరగనుంది. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై జపాన్ వెళ్లిన సీఎం బృందం అధ్యయనం చేయనుంది. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ (Skill University in Telangana) కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతో పాటు, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి వ్యాపారవేత్తలను, వివిధ సంస్థలను ఆహ్వనించనున్నట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed