రామోజీ రావు చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

by Satheesh |
రామోజీ రావు చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, తెలుగు మీడియా దిగ్గజం రామోజీ రావు అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. రామోజీ రావు చేసిన సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. అయితే, బిజీ షెడ్యూల్ వల్ల రామోజీ రావు అంత్యక్రియలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన సీఎం రేవంత్ మంగళవారం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం రామోజీ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరుఫున రామోజీ రావు అంత్యక్రియలకు మంత్రి సీతక్క హాజరైన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed