ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ షాక్.. ఇక నుంచి తిప్పలు తప్పవా..?

by Anjali |
ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ షాక్.. ఇక నుంచి తిప్పలు తప్పవా..?
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ ఆగస్టు 15కు రుణమాఫీ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. తప్పకుండా చెప్పిన తేదీ కల్లా రుణమాఫీ చేసి తీరాలని ఆదేశించిన సీఎం.. మరో నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల టైమింగ్‌పై సీఎం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఈ బయోమెట్రిక్ విధానం ఫస్ట్ సెక్రటేరియట్ నుంచే శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.

బయోమోట్రిక్‌ను అమలులోకి తీసుకొస్తే.. ఉద్యోగులు టైమింగ్‌ను పాటిస్తారని, దీంతో పనుల్లో వేగం పెరుగుతుందని, సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని భావిస్తున్నారట. సెక్రటేరియట్ తర్వాత జిల్లాలలో బయో మెట్రిక్ విధానం తీసుకురావాలని చూస్తున్నట్లు టాక్. సీఎస్, సెక్రటరీల నుంచి అటెండర్ వరకు ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ విధానంలో తమ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విధానాన్ని ముందుగా సచివాలయంలో అమలు చేశాకే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందట.



Next Story

Most Viewed