దుండిగల్‌‌లో దత్త మండపాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |
దుండిగల్‌‌లో దత్త మండపాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుండిగల్‌ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో దత్త మండపాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. మైసూర్‌లో జరగాల్సిన దసరా నవరాత్రి ఉత్సవాలు.. స్వామీజీ ఇక్కడ నిర్వహించడం సంతోషమని, ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం తెలంగాణకు శుభసూచకమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తాను ‘గతంలో ఇదే ప్రాంతానికి ఎంపీగా ఉన్నానని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యే అవకాశం వచ్చిందన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం వేగంగా అభివృద్ధి చెంది.. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ఎదిగి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలని.. కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా అంతకు ముందు ఆశ్రమానికి వచ్చిన సీఎంకు అర్చకులు వేద మంత్రాలతో ఘన స్వాగతం తెలిపారు. కార్యక్రమంలో సీఎం తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, గణపతి సచ్చిదానంద స్వామీజీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed