తెలంగాణ పోలీసు శాఖకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

by Mahesh |   ( Updated:2025-04-16 07:40:28.0  )
తెలంగాణ పోలీసు శాఖకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలోనే అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ (Telangana Police Department) అగ్రస్థానంలో నిలిచినందుకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పోలీసు శాఖకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచినట్లు 'ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 తేల్చింది. ఈ నివేదికను టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించాయి. ఇందులో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ అన్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడంలో, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత (Transparency) చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ (CM Revanth) పేర్కొన్నారు. రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ (Police Department) సమిష్టి కృషి ఫలితమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భవిష్యత్తులో తెలంగాణ పోలీసులు ఇలాంటి మరిన్ని విజయాలను సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.



Next Story

Most Viewed