సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత KCR కీలక సూచన

by Disha Web Desk 2 |
సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత KCR కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సూచన చేశారు. నల్లగొండ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కొందరు కాంగ్రెస్ మంత్రుల సోయిదప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేలా సంతకం పెట్టి వచ్చి ఇక్కడ నీతులు చెబుతున్నారని సీరియస్ అయ్యారు. నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అవగాహనతో హరీష్ రావు వెంటనే స్పందించి అసెంబ్లీలో గర్జించారని గుర్తుచేశారు. కేఆర్ఎంబీకి అప్పగించడమే కాకుండా నాలుగైదు రోజులు కాంగ్రెస్ మంత్రులు నాటకాలు ఆడారని అన్నారు. బడ్జెట్‌ను పక్కన బెట్టి ప్రాజెక్టులపై చర్చ పెట్టారని తెలిపారు. అందుకే ప్రజల్లోనే తేల్చుకుందామని నల్లగొండలో సభ పెట్టానని వెల్లడించారు. ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరుగనివ్వను అని అన్నారు. తాను నల్లగొండ సభకు పిలుపునిచ్చాకే భయపడి సభలో హడావుడిగా తీర్మానం పెట్టారని ఎద్దేవా చేశారు. ఆ తీర్మానం కూడా సక్కగా పెట్టలేదని సెటైర్ వేశారు.

కాంగ్రెస్ నేతలకు కేవలం పదవులు, పైసలే కావాలని అన్నారు. మనం హక్కుల కోసం పిడికిలి బిగించి కొట్లాడాలని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. తెలంగాణ హక్కులు, వాటాలు శాశ్వతం అని చెప్పారు. ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్ష బాధ్యతను ప్రస్తుతం తమకు ఇచ్చారని.. ఇక వెంటపడి మరీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే మాకంటే బాగా పనిచేసి చూపించాలని సూచించారు. అసెంబ్లీ అయ్యాక తాము కూడా మేడిగడ్డకు పోతామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేస్తున్నా.. సోయి ఉంటే అఖిలపక్షం ఏర్పాటు చేసి.. ఢిల్లీ తీసుకెళ్లి కొట్లాడాలని అన్నారు. అది పక్కనబెట్టి రాజకీయ విమర్శలకు దిగడం కరెక్ట్ కాదని సీరియస్ అయ్యారు.



Next Story

Most Viewed