షబ్బీర్ అలీ ఇంట్లో CM రేవంత్ రంజాన్ సెలబ్రేషన్స్

by Disha Web Desk 2 |
షబ్బీర్ అలీ ఇంట్లో CM రేవంత్ రంజాన్ సెలబ్రేషన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంజన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. షబ్బీర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం షబ్బీర్ ఇంట్లో జరిగిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షితో పాటు సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్ధి దానం నాగేందర్, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ అని గుర్తు చేశారు. ముస్లింలకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ రంజాన్ పండుగ ఎంతో గొప్పదని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

Next Story

Most Viewed