తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి

by Dishafeatures2 |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ సతీమణి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆమె.. ఇవాళ ఉదయం అర్చన సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శోభకు ఆశీర్వచనాలు అందించిన అర్చకులు.. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు. శోభ వెంట కొంతమంది కుటుంబసభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు కూడా పాల్గొన్నారు.

Next Story