కేసీఆర్, కేటీఆర్‌‌ల మధ్య గొడవలు.. ఆ మీటింగ్‌తో బట్టబయలు?

by Disha Web Desk 2 |
కేసీఆర్, కేటీఆర్‌‌ల మధ్య గొడవలు.. ఆ మీటింగ్‌తో బట్టబయలు?
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పార్టీలో కొత్త సమస్య మొదలైందా?. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న అధికార పార్టీలో కీలక నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతోంది?. ఇప్పుడు ఇదే చర్చ రాజకీయా వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇన్నాళ్లు టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అనేలా ఉన్న పార్టీలో అసంతృప్తి రాగాలు చివరకు కొంప ముంచుతాయా అనే ఆందోళన ఆ పార్టీ నేతలల్లో నెలకొందట. గులాబీ పార్టీలో పైకి కనిపించని కల్లోలం ఎటు దారి తీస్తుందో అర్థం కాని పరిస్థితి ఉందనే చర్చ సాగుతోంది. ఇటీవల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మధ్య విబేధాలు పొడసూపాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి మధ్య గ్యాప్ ఏ రేంజ్‌లో ఉందో స్పష్టం కావాలంటే కేటీఆర్ విదేశీ పర్యటన టూర్ లో జరిగిన మార్పులే నిదర్శనం అని కొంత మంది చెబుతున్నారు.

కేసీఆర్ మీటింగ్ కు కేటీఆర్ గైర్హాజరు?

దాదాపు 16 రోజుల పాటు ఫామ్ హౌజ్‌లో ఉండిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అజ్ఞాతం వీడి ప్రగతి భవన్ చేరుకున్నారు. వచ్చి రాగానే బుధవారం పలు కీలక అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రులు, మేయర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధింత శాఖల కార్యదర్శులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, స్తానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం హాజరు కాలేకపోయారు. కేటీఆర్ గైర్హాజరుకు ఆయన లండన్ పర్యటనలో ఉండటమే కారణం అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మరో కారణం ఉందనే చర్చ కూడా జరుగుతోంది.

చర్చకు తెరలేపిన కేటీఆర్ టూర్ షెడ్యూల్ మార్పు :

మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాల్సి ఉంది. అయితే దీనికి ఐదు రోజుల ముందు యూకేలోనూ పర్యటిస్తారని మంత్రి కార్యాలయం గత మంగళవారం ప్రకటించింది. లండన్‌లో పారిశ్రామిక వేత్తలతో నిర్వహించే సమావేశాల్లో ఆయన హాజరు అవుతున్నాయి. కాగా, సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి ప్రగతి భవన్ చేరుకున్న తెల్లారే కేటీఆర్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే ముందే లండన్ చేరిపోవడం రాజకీయవర్గాల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతుననాయి.

కేటీఆర్ ఒంటరి పోరాటం :

కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 16 రోజుల పాటు ఉన్న సమయంలో బీజీబిజీగా ఉన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో దూసుకుపోయారు. ఈ గ్యాప్‌లో రాహుల్ గాంధీ, జేపీ నడ్డా, అమిత్ షా పర్యటనలు జరిగినా వాటన్నింటినీ ఆయన సమర్ధవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ పదునైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలపై దూకుడుగా ముందుకు వెళ్లారు. పార్టీ పరంగా మిగతా నేతలు స్పందించినప్పటికీ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన పోరాటం అన్ని వర్గాల్లో చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.

టీఆర్ఎస్‌లో ఇదేమీ కొత్తకాదు :

టీఆర్ఎస్ పార్టీలో అధినేతకు మధ్య గ్యాప్‌లు కొత్తేమి కాదనే వాదనలూ లేకపోలేదు. గతంలో మంత్రి హరీష్ రావు విషయంలోనూ ఇలాంటి ప్రచారమే జరిగింది. 2018 ఎన్నికలకు కొన్ని రోజుల పాటు టీఆర్ఎస్ నేతల్లో కొంత మంది ఇచ్చిన పేపర్ ప్రకటనల్లో మంత్రి హరీష్ రావు ఫోటోలు లేకుండానే వచ్చాయి. పార్టీలో బలమైన నేతగా, ప్రభుత్వంలోనూ కీలక మంత్రిగా ఉన్న హరీష్ రావు ఫోటో లేకుండా మిగతా వారి ఫోటోలు ఉండటం హరీష్ రావు అభిమానులకు తీవ్రంగా కలిచి వేసింది. పార్టీలో జరుగుతున్న తీరుపై హరీష్ రావు అభిమానులు ఇంటర్నెట్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత క్రమంగా హరీష్ రావు ఫోటోలను అన్ని ప్రకటనల్లో ఇస్తూ వస్తున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తండ్రి, కొడుకుల మధ్య ఏర్పడిన గ్యాప్ నిజంగానే ఏర్పడిందా? లేక ఏదైనా వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ ఇలాంటి ప్లాన్ అమలు చేస్తోందా? అనేది మాత్రం ఎవరికి అంతుచిక్కని వ్యవహారంగా మారిపోయింది.


Next Story