బీఆర్ఎస్ తొలి టార్గెట్ ఆ రాష్ట్రమే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk |
బీఆర్ఎస్ తొలి టార్గెట్ ఆ రాష్ట్రమే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చుతూ ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ ప్రతినిధుల సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలకు రాజకీయాలు ఒక ఆటలాంటివి అయితే టీఆర్ఎస్ కు అది ఓ టాస్క్ వంటిదని అన్నారు. తెలంగాణ కోసం కష్టపడినట్లే దేశం కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు. జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని దీని వెనుక ఎంతో ఆలోచన ఉందన్నారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమి లేదని దేశంలో ఇంకా కుల, లింగ వివక్ష సమసిపోలేదని చెప్పారు. తెలంగాణలో అమలు అవుతున్న దళిత బంధు, రైతు బంధును చూసి దేశం ఆశ్చర్యపోతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 17 లక్షల 50 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రాలు, దేశం అభివృద్ది చెందితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం అవుతుందని జాతీయ పార్టీతో ముందడుగు వేయబోతున్నట్లు వెల్లడించారు. సరిగ్గా 21 ఏళ్ల క్రితం జలదృశ్యంలో టీఆర్ఎస్ ప్రస్థానం ప్రారంభమైందని.. ఇప్పుడు దేశ ప్రజల సమస్యలే ఎజెండాగా జాతీయ పార్టీ స్థాపించినట్లు కేసీఆర్ ప్రకటించారు. సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ నష్టపోయిందన్నారు. స్వరాష్ట్రంలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇవన్నీ ఎలా సాధ్యం అయ్యాయని పక్కా రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని ఇదంతా ఒక దీక్షలా చేశాం కాబట్టే సాధ్యమైందన్నారు. మనతో కలిసి వచ్చేందుకు అనేక పార్టీ నేతలు మందుకు వస్తున్నారని, అఖిలేష్, తేజస్వీయాదవ్ హైదరాబాద్ కు వ్సతామన్నారు.. నేనే వద్దాన్నాని చెప్పారు.

సీఎంగా నేనే

బీఆర్ఎస్ తర్వాత సీఎం పదవి కేటీఆర్ కు ఇస్తారనే ప్రచారానికి కేసీఆర్ తెరదించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ నేను సీఎంగా ఉంటూనే దేశం మొత్తం పర్యటిస్తాన్నారు. మొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటామని, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ రైతు సంఘం మహారాష్ట్ర నుంచే మొదలవుతుందని చెప్పారు. దళిత ఉద్యమం, రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమం ద్వారా వీటిని ప్రధాన ఎజెండాగా తీసుకోని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వున్న అనేక సామాజిక రాజకీయ రుగ్మతలను తొలగిస్తామని, ఇప్పటికే తెలంగాణ ఆచరించి దేశానికి చూపించిందన్నారు. తలెత్తున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతామని, తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు తీసుకపోయినట్టుగానే, దేశాన్ని ముందుకు తీసుకపోవాలే అన్నారు. తెలంగాణ లో ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేసి సాధించామని, పల్లెలు పట్టణాలను అభివృద్ధి పరుచుకున్నామని. కేంద్రం ప్రకటించిన అవార్డులే అందుకు సాక్ష్యం అని వెల్లడించారు. తాను హైదరాబాద్ ద్వారానే దేశ రాజకీయాలను చేయబోతున్నట్లు సీఎం స్పష్టం చేశారు.


Next Story

Most Viewed