అజ్మీర్ దర్గాకు సీఎం 'చాదర్' సమర్పణ

by Disha Web |
అజ్మీర్ దర్గాకు సీఎం చాదర్ సమర్పణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: అజ్మీర్ దర్గా ఉర్సు సందర్భంగా, ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే 'చాదర్' ను సీఎం కేసీఆర్ ఈ ఏడాది సమర్పించారు. బుధవారం ప్రగతి భవన్‌లో ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రార్థనలు చేసిన అనంతరం చాదర్‌ను ఆజ్మీర్ దర్గాలో సమర్పించేందుకు వక్ఫ్ బోర్డు అధికారులకు కేసీఆర్ అందచేశారు. కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎమ్మెల్యేలు మహమ్మద్ షకీల్, గ్యాదరి కిశోర్ కుమార్, సుధీర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.


Next Story