Telangana News : విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త

by Anjali |
Telangana News : విద్యార్థులకు సీఎం కేసీఆర్ శుభవార్త
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తెలంగాణలో కొత్తగా నిర్మించిన 9 మెడికల్ కాలేజీలను వర్చ్యువల్‌గా నేడు కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వెంటనే.. నర్సింగ్, పారా మెడికల్ కోర్సులను ఏర్పాటు చేయాలని.. వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి ఆదేశించారు. దీంతో తెలంగాణలోని పేద విద్యార్థులకు మంచి అవకాశం లభిస్తుందని.. ప్రస్తుతం దేశంలో పారా మెడికల్ కోర్సులకు దేశవ్యాప్తంగా భారీగా డిమాండ్ ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా.. అర్హత కలిగిన వారికి అవకాశాలు ఇచ్చేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Next Story