బ్రేకింగ్: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కీలక హామీ ప్రకటించిన కేసీఆర్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కీలక హామీ ప్రకటించిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటో డ్రైవర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆటో డ్రైవర్ల కోసం గులాబీ బాస్ కొత్త హామీ ప్రకటించారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్ వద్ద నిర్వహించిన బీఆర్ఎస్ ప్రభా ఆశీర్వాధ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్యాసింజర్ ఆటోలకు ఫిట్‌నెస్, పర్మిట్ ఫీజు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఫిట్‌నెస్ ఫీజు రూ.750, పర్మిట్ ఫీజు రూ. 500 మాఫీ చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ నిర్ణయంపై ఆటో డ్రైవర్లు, యూనియన్లు హార్షం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story