బిగ్ బ్రేకింగ్ : TRS రాజ్యసభ అభ్యర్థులను ఫిక్స్ చేసిన CM KCR

by Disha Web |
బిగ్ బ్రేకింగ్ : TRS రాజ్యసభ అభ్యర్థులను ఫిక్స్ చేసిన CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులను ఫిక్స్ చేశారు సీఎం కేసీఆర్. డా.బండి పార్థసారథి రెడ్డి., వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)., దీవకొండ దామోదర్ రావుల పేర్లను ఖరారు చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్​ అధికారికంగా ప్రకటించారు. హెటిరో ఫార్మా అధినేత పార్థసారధి రెడ్డి, గ్రానైట్​ వ్యాపారి రవిచంద్ర, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్​ రావులను పెద్దల సభకు ఎంపిక చేశారు. సీఎం కేసీఆర్​ నుంచి సమాచారం రావడంతో వీరు ప్రగతిభవన్​ కు బయలుదేరారు.

రిచెస్ట్​ పర్సన్​ పెద్దల సభకు

హెటిరో డ్రగ్స్​ అధినేత పార్థసారధి రెడ్డి హైదరాబాద్​ ధనికుల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆయనపై ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 ప్రకారం, హెటిరో ల్యాబ్స్‌కు చెందిన పార్థసారధి రెడ్డి, అతని కుటుంబం అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో 58వ స్థానంలో ఉన్నారు. అతని సంపద కరోనా సమయంలో కేవలం ఏడాది కాలంలో 88% పెరిగి రూ.26,100 కోట్లకు చేరుకుంది. 2018 వరకు హైదరాబాద్​ ధనికుల జాబితాలో 81వ ర్యాంక్‌ లో ఉన్న ఆయన.. ఆ తర్వాత ఏకంగా రెండో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుతం ధనవంతుల జాబితాలో రెండో స్థానంలోనే కొనసాగుతున్నారు.

Next Story