రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. వాళ్లందరికీ మంచి జరగాలని ప్రార్థన

by Shiva Kumar |
రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. వాళ్లందరికీ మంచి జరగాలని ప్రార్థన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ‘క్రోధి’ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వా, తాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు. ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో ఆంధ్ర రాష్ట్రం అంతా నిత్య వసంతం నెలకొనాలని సీఎం ఆకాంక్షించారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, రాష్ట్రం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడాలని భగవంతుడిని ప్రార్థించారు. 'క్రోధి’ నామ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.Next Story