అధిష్టానం గ్రీన్ సిగ్నల్.. భట్టి విక్రమార్క పాదయాత్ర తేదీలు ఖరారు

by Disha Web Desk 2 |
అధిష్టానం గ్రీన్ సిగ్నల్.. భట్టి విక్రమార్క పాదయాత్ర తేదీలు ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కన్ఫామ్ ​అయింది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నది. ఆదిలాబాద్​ నుంచి ఖమ్మం వరకు కొనసాగించనున్నారు. 39 నియోజకవర్గాలలో 91 రోజుల పాటు పాదయాత్ర జరగనున్నది. ఢిల్లీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్​ సిగ్నల్​ రావడం గమనార్హం. అయితే ఇప్పటికే మహేశ్వర్​రెడ్డి బైంసా నుంచి తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించగా, దాన్ని భట్టి చేసే యాత్రలో విలీనం చేయనున్నారు. అంటే షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్​తో ముగియాల్సిన మహేశ్వర్​రెడ్డి యాత్ర ఖమ్మం వరకు కంటిన్యూ కానున్నది. ఇది భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది. అయితే గతంలో ఉన్న షెడ్యూలును మార్పులు చేస్తూ ఎక్కువ ప్రాంతాలు కలిసేలా ప్రణాళికను రూపకల్పన చేశారు. ఈ ఈ యాత్రకు సీనియర్లంతా మద్ధతు తెలిపారు.

1365 కిలోమీటర్లలో..

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్రను డిజైన్ చేశారు. బీఆర్​ఎస్​ఇచ్చిన హామీలు, చేయలేని పనులన్నింటినీ భట్టి పాదయాత్రలో ఇంటింటికి వివరించనున్నారు. దీంతో పాటు నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న జాప్యం, ప్రాజెక్టులపై అక్రమాలు వంటివన్నీ భట్టి ఆధ్వర్యంలో ప్రజలకు చేరవేయాలని కాంగ్రెస్​ పార్టీ ఆలోచిస్తున్నది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పాదయాత్ర చేస్తుండగా, మహేశ్వర్​రెడ్డి కూడా మరో యాత్ర చేస్తున్నారు.

దీనికి అదనంగా భట్టి మొదలు పెడుతుండటం, కోమటి రెడ్డి తాను కూడా చేస్తానని ప్రకటించడంతో కాంగ్రెస్​పార్టీ కేడర్​లో కన్ఫ్యూజన్​ నెలకొన్నది. పార్టీ ప్రజల్లోకి ఫోకస్​వస్తున్నప్పటికీ, కార్యకర్తల్లో వర్గఫోరు మొదలైందని క్షేత్రస్థాయిలో చర్చించుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క శనివారం గాంధీభవన్​లో మాట్లాడుతూ..పాదయాత్రలో భాగంగా మంచిర్యాల, హైదరాబాద్ శివారు, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఉంటాయన్నారు. కాంగ్రెస్​పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఖర్గే ఆదేశాలతోనే పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్నారు.



Next Story

Most Viewed