- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మంత్రి హరీష్ రావు పాల్గొన్న కార్యక్రమంలో బీజేపీ-టీఆర్ఎస్ బాహాబాహి!
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకు బలపడుతోంది. తాజాగా మంత్రి హరీష్ రావు, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అనుచరుల మధ్య మరోసారి ఆధిపత్య పోరు బహిర్గతం అయింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బుధవారం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ బాహాబాహీకి దిగారు. భూంపల్లి-అక్బర్ పేట తహశీల్దార్ కార్యాలయం, జాయింట్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు.
కాగా కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నేతలు ఆఫీస్ లోపలికి వెళ్లారు. ఇంతలో ఇరు పార్టీల శ్రేణులు తమకు అనుకూలంగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు కలుగజేసుకుని కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఇటీవల దుబ్బాక నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలలో చాలా వరకు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుమ ఇలాంటి గొడవలు పెరిగిపోవడం రాజకీయ వర్గాల్లో చర్చ గా మారుతోంది.
READ MORE
- Tags
- BJP Vs TRS
- Clash