విజయసాయిరెడ్డికి కేంద్రంలో కీలక పదవి

by Disha Web Desk |
విజయసాయిరెడ్డికి కేంద్రంలో కీలక పదవి
X

దిశ, వెబ్‌డెస్క్:దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి అత్యంతనమ్మినబంటుగా ఏపీ రాజకీయాల్లో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి పేరుంది. ఏపీ సీఎం జగన్ కు రైట్ హ్యాండ్ గా ఆయనను చెబుతూ ఉంటారు. జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఎప్పటినుంచో విజయసాయిరెడ్డి ఉంటున్నారు. ప్రస్తుతం వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డి.. నేతలను సమన్వయం చేసుకుంటూ జగన్ కు అండగా ఉంటున్నారు. సీఎం అయిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో జగన్ బిజీగా ఉండటంతో పార్టీలోని బాధ్యతలను విజయసాయిరెడ్డి నడిపిస్తున్నారు.

ప్రస్తుతం రాజ్యసభ ఎంపీకి ఉన్న విజయసాయిరెడ్డికి కేంద్రంలో మరో కీలక పదవి దక్కింది. కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌర విమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా ఆయన నియమితులయ్యారు. దీనికి సంబంధించి రాజ్యసభ కార్యాయలం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ కీలక పదవి దక్కడంపై విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో కీలక పదవి దక్కడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.



Next Story