'చిన్నోడి  ముక్తకాలు' పుస్తకావిష్కరణ..

by Disha Web Desk 13 |
చిన్నోడి  ముక్తకాలు పుస్తకావిష్కరణ..
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రసిద్ధ కవి, కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘చిన్నోడి ముక్తకాలు’ పుస్తకాలు పుస్తకావిష్కరణ హైదరాబాద్ నార్సింగిలోని తెలంగాణా క్రీడా ప్రాంగణంలో జరిగింది. ఈ సాహిత్య కార్యక్రమంలో ప్రముఖ కవి శ్రీ దర్భశయనం శ్రీనివాసాచార్య పాల్గొన్నారు. అనంతరం ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కవి వారాల ఆనంద్ తన మనవడిలో తన బాల్యాన్ని దర్శించుకుని రాసిన కవిత్వమిదని.. తనని తాను అద్దంలో చూసుకుని ఆయన ఈ రచన చేశారన్నారు. ఎవరికైనా జీవితంలో బాల్యం అత్యంత మధురమైనదని.. ఇవాళ 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఈ ‘చిన్నోడి ముక్తకాలు’ పుస్తకంలో తమని తాము చూసుకుంటారన్నారు. తాతా, మనవళ్ళ అనుబంధాన్ని కవితాత్మకంగా రాశారని ఆయన పేర్కొన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. మనిషి జీవితంలో బాల్యాన్ని మించిన ఆనందం మరేదీ లేదన్నారు. అలాంటి బాల్యాన్ని ఊరించి అరవై ఏళ్ల వయసు దాటాక మళ్ళీ దర్శించి రాయడం గొప్పగా ఉందన్నారు. కవితాత్మకంగా రాయడం చాలా బాగుంది అన్నారు. సాహితీ విమర్శకురాలు డాక్టర్ విశ్ను వందనా దేవి మాట్లాడుతూ.. తాతా, మనవళ్ళు అయిన వారాల ఆనంద్ ప్రద్యుమ్న ల అనుబంధం కవితా రూపంలో ఆవిష్కృతమైందన్నారు. మనవడితో తాత పెంచుకున్న ప్రేమ అందరికీ చెందుతుంది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిన్నోడు ప్రద్యుమ్న, రేల, వేణుమాధవ్, ఇందిర రాణి తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed