బర్త్ డే పార్టీ ముసుగులో బాల్య వివాహం.. విషయం బయటకు పొక్కడంతో!

by Disha Web Desk 2 |
బర్త్ డే పార్టీ ముసుగులో బాల్య వివాహం.. విషయం బయటకు పొక్కడంతో!
X

దిశ, వెబ్‌డెస్క్: బర్త్ డే వేడుకల పేరుతో గుట్టుచప్పుడు కాకుండా బాల్యవివాహం జరిపించడం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో కలకలం రేపింది. పాపిరెడ్డి గూడలో 12 ఏళ్ల బాలికను 35 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తికి కట్టబెట్టారు. బాల్యవివాహం జరిపిస్తున్నామని బయటకు తెలిస్తే గొడవ జరుగుతుందని ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పుట్టిన రోజు వేడుకల పేరుతో ఈ వివాహ తంతును బాలిక తల్లిదండ్రులు పూర్తి చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు వచ్చి బాలికను చేరదీశారు. పాపిరెడ్డిగూడకు వెళ్లిన అధికారులు సమాచారం సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాల్యవివాహాలచు చట్టవ్యతిరేకం అని తెలిసినా బర్త్ డే వేడుకల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా జరిగించడం అధికారులను విస్మయానికి గురి చేసింది.



Next Story

Most Viewed