నిప్పుల గుండంలో నడిచిన పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

by Disha Web Desk 12 |
నిప్పుల గుండంలో నడిచిన పోలీసులు.. ఎక్కడో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాతో పాటు పరిసర ప్రాంత ప్రజలు చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి వారిని కొంగుబంగారంగా కొలుస్తారు. ఈ క్రమంలో చెరువుగట్టు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంధోబస్తుకు వచ్చిన పోలీసులు కూడా.. ఆ పరమశివుని భక్తిలో మునిగిపోయి.. అగ్నిగుండంలో నడిచి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే పోలీసులు అగ్నిగుండాల్లో నడవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ ఉద్యోగాల్లో ఉంటూ.. మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన వారు.. ఇలా.. చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తుండగా.. ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మంచి పరిణామం అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed