చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం.. సుప్రీం కోర్టు 50వ సీజేఐగా..

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-09 04:52:23.0  )
చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం.. సుప్రీం కోర్టు 50వ సీజేఐగా..
X

దిశ, వెబ్ డెస్క్: సుప్రీం కోర్టు 50వ సీజేఐగా డీవై చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చంద్రచూడ్‌తో ప్రమాణం చేయించారు. చంద్రచూడ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. హర్వర్డ్ యూనివర్సిటీ నుంచి రెండు అడ్వాన్స్ డ్ లా డిగ్రీలు పొందారు. 39 ఏళ్లకే బాంబే హై కోర్టులో సీనియర్ లాయర్ గా విధులు నిర్వహించారు. 2024 నవంబర్ 10 వరకు సీజేఐగా చంద్రచూడ్ కొనసాగనున్నారు. అయోధ్య భూవివాదం, గోప్యత హక్కుల్లో కీలక తీర్పు ఇచ్చారు. చంద్రచూడ్ పూర్తి పేరు ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్. 1959 నవంబర్ 11న జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ప్రభ దంపతులకు మహారాష్ట్రలో జన్మించారు.



Next Story