టీఎన్జీవోస్ శైలజకు చాకలి ఐలమ్మ అవార్డు

by Disha Web Desk 4 |
టీఎన్జీవోస్ శైలజకు చాకలి ఐలమ్మ అవార్డు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ అవార్డును టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగన్నాథం శైలజ అందుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే ఫౌండేషన్ ట్రస్ట్ అండ్ బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, జైళ్ల శాఖ సూపరిండెంట్ శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మని ఆదర్శంగా తీసుకొని మహిళా సాధికారతను సాధించి రాజ్యాధికారం వైపు పయనించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారీ సామాజిక విప్లవకారిణి చాకలి ఐలమ్మ అవార్డులను 25 మంది మహిళలకు ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు చేసిన మహిళలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను ప్రదానం చేశామని ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ రవి శంకర్ ప్రజాపతి, వ్యవస్థాపక అధ్యక్షుడు సూర్యారావు తెలిపారు. అనంతరం అవార్డు గ్రహీత జగన్నాధం శైలజ మాట్లాడుతూ.. వైద్యులు దేవుళ్ళతో సమానమని, వైద్యరంగంలో చేసిన సేవలు గాను, టీఎన్జీవోస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా అందించిన సేవలకు గాను తనకు చాకలి ఐలమ్మ అవార్డును ఇద్దరు అతిధుల చేతుల మీదుగా అందుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed