2021-22 నాటికి తెలంగాణ అప్పులు ఎన్ని కోట్లో తెలుసా..?

by Disha Web Desk 19 |
2021-22 నాటికి తెలంగాణ అప్పులు ఎన్ని కోట్లో తెలుసా..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం చేసిన అప్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలు బయట పెట్టింది. 2022 అక్టోబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.4,33,817.6 కోట్లు ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి 75 వేల 577 కోట్ల అప్పులు ఉంటే అవి 2021-22 నాటికి 2 లక్షల 83 వేల కోట్లకు చేరాయని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు లక్షా 50 వేల కోట్ల రుణాలు తీసుకోగా 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు లక్షా 30 వేల కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రం ఏర్పాటు అయ్యాక తెలంగాణ అప్పులు (కోట్లలో):

2014-15 రూ.8,121

2015-16 రూ.15,515

2016-17 రూ. 30,319

2017-18 రూ. 22,658

2018-19 రూ. 23,091

2019-20 రూ. 30,577

2020-21 రూ. 38,161

2021-22 రూ. 39,433



Next Story

Most Viewed