- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా పై కేంద్రం కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Ranga Reddy Project)పై కేంద్రం కీలక నిర్ణయం (Centerkey decision) తీసుకుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభం అయినప్పటి నుంచి.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా (National status) కల్పించాలనే డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పలుమార్లు జాతీయ హోదా కోసం కేంద్రాన్ని ప్రభుత్వం సంప్రదించి, విజ్ఙప్తి చేశారు. ఈ క్రమంలో రాష్ట్రం చేసిన విజ్ఙప్తిపై ఈ రోజు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా (National status) కల్పించడం ప్రస్తుతం సాధ్యం కాదని (Not possible) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక మదింపు చేయకుండా.. జాతీయ హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు (Palamuru Ranga Reddy Lift Project)ను మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకు.. 2015 జూన్ 11న నాటీ సీఎం కేసీఆర్ (CM KCR) శంకుస్థాపన (foundation stone)చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణా నది నుంచి 70 టీఎంసీల వరద నీటిని ఎత్తి పోయడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యం. దీని ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 7 లక్షల ఎకరాలకు, రంగారెడ్డి జిల్లాలో 2.7 లక్షల ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 0.3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023 సెప్టెంబరు 16న నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి (Chief Minister KCR started), జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీరు, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో తాగునీరు, సాగునీరు అందించే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. నాగర్‌కర్నూలు జిల్లా, కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద శ్రీశైలం జలాశయం నుండి నీటిని తోడి, రంగారెడ్డి జిల్లా, కొందుర్గ్ మండలం, లక్ష్మీదేవిపల్లి వరకూ పంపిస్తారు. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రోజుకు 1.5 టి.ఎమ్‌సి చొప్పున మొత్తం 90 టిఎమ్‌సి ల నీటిని ఎత్తిపోయాలనేది ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకొని నిర్మించారు.