ఉరుములు మెరుపుల్లో పేలిన సెల్ ఫోన్.. వ్యక్తి మృతి

by Rajesh |
ఉరుములు మెరుపుల్లో పేలిన సెల్ ఫోన్.. వ్యక్తి మృతి
X

దిశ, మక్తల్ : ఉరుముల మెరుపుల సమయంలో సెల్ ఫోనులో మాట్లాడుతున్న వ్యక్తి ఒక్క సారిగా మొబైల్ పేలడంతో నిండు ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మతోన్గోడు గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఉరుముల మెరుపుల సమయంలో పొలం వద్ద ఆరు బయట ఉన్న కుర్మయ్య జేబులో ఉన్న సెల్ ఫోన్‌కు పిడుగు విద్యుత్ తరంగాలు చేరడంతో సెల్‌ఫోన్ పేలి చాతి భాగం కాలిపోయి చనిపోయాడని గ్రామస్తులు బంధువులు తెలిపారు.

బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయ పనులపై పొలం దగ్గర ఉన్న చాకలి కురుమయ్య(40) అలవాటు ప్రకారం సెల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా.. పిడుగు పాటుకు పొలంలోఉన్న చాకలి కుర్మయ్య జేబులో ఉన్న సెల్ ఫోన్‌కు విద్యుత్ తరంగాలు చేరి పేలడంతో మృతి చెందాడు. చీకటి పడి తొమ్మిది గంటలైన కుర్మయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రి వెతకగా పొలంలో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నట్టు సమాచారం కేసు నమోదు చేసుకున్న మక్తల్ పోలీసులు పోస్టుమార్టంపై శవాన్ని మక్తల్ ఆస్పత్రికి తరలించారు.

Next Story