బ్రేకింగ్: తెలంగాణ ఎన్నికలకు సీఈసీ కసరత్తు షురూ.. షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్..?

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: తెలంగాణ ఎన్నికలకు సీఈసీ కసరత్తు షురూ.. షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు షురూ అవుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అధికారులు ఎన్నికల నిర్వహణ కసరత్తును స్టార్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం పర్యటన చేయనుంది. సీఈసీ అధికారుల బృందం రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా అధికారుల బృందం ఎన్నికల నిర్వహణపై సమీక్షించనున్నారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ భాగస్వామ్య పక్షాలు, అధికారులను సంప్రదించనున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణకు ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే. జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని సైతం వేసింది. ఈ కమిటీ ఇప్పటికే ఓ సారి భేటీ అయ్యింది. దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం కాకుండా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరుగుతాయని జోరుగా ప్రచారం జరిగింది.

మంత్రి కేటీఆర్ సైతం జమిలీ ఎన్నికలు వస్తే తెలంగాణలో ఎన్నికలు ఏప్రిల్ జరగొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జమిలీ ఎన్నికల ప్రచారంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ నెలలో తెలంగాణలో పర్యటించి ఎన్నికల నిర్వహణ కసరత్తు ప్రారంభింస్తుండటంతో ఇక తెలంగాణలో జమిలీ ఎన్నికలు లేనట్లే తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ నెలలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed