MLC Kavitha లేఖకు సీబీఐ రిప్లై.. విచారణ తేదీ ఫిక్స్..!

by Disha Web Desk 19 |
MLC Kavitha లేఖకు సీబీఐ రిప్లై.. విచారణ తేదీ ఫిక్స్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ రిప్లై ఇచ్చింది. డిసెంబర్ 11న విచారణకు అందుబాటులో ఉండాలని సీబీఐ ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. ఈ కేసులో 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితను మంగళవారం సీబీఐ ప్రశ్నించాల్సి ఉంది. కానీ తనకు ముందస్తుగా నిర్ణయించుకున్న పనుల కారణంగా తాను మంగళవారం అందుబాటులో ఉండటం లేదని అందువల్ల విచారణ కోసం డిసెంబర్ 11, 12, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో విచారణకు అందుబాటులో ఉంటానని కవిత సోమవారం సీబీఐకి లేఖ రాసింది. కవిత రాసిన లేఖపై 24 గంటలు దాటిన సీబీఐ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో సర్వత్రా హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఆమె రాసిన లేఖకు మంగళవారం ఈ మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చిన సీబీఐ డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని మీ నివాస చిరునామాకు సీబీఐ టీమ్ వస్తుందని సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స పేరుతో కవితకు సమాచారం అందించారు. ఆ రోజున మీ స్టేట్ మెంట్ రికార్టు కోసం మీ అందుబాటును తెలియజేయాలని సీబీఐ కవితను కోరింది.

Read more:

MLAs purchasing Case: ''సీబీఐకి కుదరకుంటే స్పెషల్ సిట్‌కు అప్పగించండి!'


Next Story

Most Viewed