లిక్కర్ మాఫియాలో కవిత.. మరీ డ్రగ్ మాఫియా వెనుక ఉందేవరు..? సునీతారావు

by Disha Web Desk 19 |
లిక్కర్ మాఫియాలో కవిత.. మరీ డ్రగ్ మాఫియా వెనుక ఉందేవరు..? సునీతారావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ శంషాబాద్‌లో నిర్వహించనున్న సన్ బర్న్ షోను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్, డీజీపీలను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ.. తెలంగాణలో రోజు రోజుకు విచ్చలవిడిగా పెరిగిపోతున్న అత్యాచారాలు, డ్రగ్స్, హత్యలు నడుమ సన్‌బర్న్ పేరుతో తలపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తెలంగాణలో అధికార పార్టీ అండదండలతో మద్యం, డ్రగ్స్ సరఫరా అవుతుందని ఆరోపించారు. దానివల్ల తెలంగాణ క్రైమ్ రేటులో దేశంలో అగ్రస్థానంలో ఉండటం సిగ్గుచేటని విమర్శించారు. మరోవైపు లిక్కర్ మాఫియాలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉంటే, మరి డ్రగ్స్ మాఫియా వెనక ఎవరున్నారు? అనే ప్రశ్నపై సమాధానం తెలయాలి! అంటూ సునీతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed