నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.. 2 గ్యారంటీల ఇంప్లిమెంట్‌పై సమీక్ష

by Disha Web Desk 4 |
నేడు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం.. 2 గ్యారంటీల ఇంప్లిమెంట్‌పై సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరుగ్యారంటీల అమలులో మరో ముందడుగు పడనుంది. ఇప్పటికే మహాలక్మీ, ఆరోగ్యశ్రీ పథకం పరమితిని కాంగ్రెస్ సర్కారు రూ.పది లక్షలకు పెంచింది. కాగా, కోస్గి సభలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో ఈ స్కీంలు ఇంప్లిమెంట్ చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేడు కేబినెట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడం ఆసక్తిగా మారింది. గృహజ్యోతి, రూ.500లకు గ్యాస్ సిలిండర్ పథకాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. వీటితో పాటు పురపాలక, ఆర్ డబ్ల్యూఎస్ విభాగాలతో తాగునీటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కేబినెట్ సబ్ కమిటీ బేటీ అనంతరం రెండు స్కీంల విధివిధానాలపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రెండు గ్యారంటీలపై రేవంత్ రెడ్డి చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Next Story

Most Viewed