మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.. MLC కవిత పోరాట ఫలితమే: కోలేటి దామోదర్

by Disha Web Desk 19 |
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.. MLC కవిత పోరాట ఫలితమే: కోలేటి దామోదర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ కీలకపాత్ర పోషించనున్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారి మహిళల మద్దతును సాధిస్తారనే భయంతో కేంద్రం దిగివచ్చిందన్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదించి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని తెలిపారు. గత తొమ్మిదేళ్ళ పాలనలో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి పట్టించుకోకుండా మొద్దునిద్రలో ఉన్న కేంద్రాన్ని మేల్కొపి తెరపైకి తీసుకువచ్చిన ఘనత కవితకే దక్కుతుందన్నారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లతో రాజకీయ అవకాశాలు లభిస్తాయని ఆకాంక్షించారు. కేంద్రం పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.

Read Disha E-paper

Next Story

Most Viewed