చినజీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం

by Disha Web Desk 4 |
చినజీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: భక్తి ముసుగులో వేల కోట్ల సామ్రాజాన్నిజీయర్ స్వామి దిష్టిబొమ్మ దహనం నిర్మిస్తున్నారని ప్రజా సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. సాధారణ మతబోధకుడు అయినా రామానుజంను దేవుడిగా చిత్రీకరించి 120 కిలోల బంగారంతో చైనాలో విగ్రహం తయారు చేయించి కోట్లాది రూపాయలు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. సమ్మక్క, సారక్కలపై చిన జీయర్ స్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ గిరిజన సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య పార్కు వద్ద చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఆర్. శ్రీరాంనాయక్ మాట్లాడుతూ.. మనువాద భావజాల వ్యాప్తి లో భాగంగానే కింది కులాల దేవతలను , ఆచారాలను, సంస్కృతిని ఆహార అలవాట్లను కించపరిచే విధంగా చినజీయర్ స్వామి మాట్లాడుతున్నాడని విమర్శించారు.

ఆదివాసి గిరిజన ఆరాధ్యగా పూజింపబడుతున్న సమ్మక్క- సారలమ్మలను అవమానించి గిరిజనులతో పాటు కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంత ఆందోళన జరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ డేరా బాబాగా మారిన జీయర్ స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణం అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.దశరథ్, రాష్ట్ర నాయకులు మహేందర్, జి .రాములు, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, జిల్లా నాయకులు రమేష్, వెంకన్న, కృష్ణ ,చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed