ముఖ్యమంత్రి కేసీఆర్‌కు RS ప్రవీణ్ కుమార్ సలహా

by GSrikanth |
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు RS ప్రవీణ్ కుమార్ సలహా
X

దిశ, డైనమిక్ బ్యూరో: అలంపూర్ జోగులాంబ జిల్లాలో ఆర్డీఎస్ కాలువలో పూడికతీత పనులు జరుగుతున్నాయి. అయితే ఈ పనుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోలేదు. కాలువలో 3 ఇంచు‌ల సీసీ లైనింగ్ ఉంది. దీన్ని గమనించకుండా13 టన్నుల బరువు కలిగిన 200 ఎల్‌అండ్‌‌టీ మిషన్‌తో పూడికతీత పనులు చేస్తున్నారు. దీంతో లైనింగ్ మొత్తం ధ్వంసమవుతోంది. ఎక్కడికక్కడ పగుళ్లు వచ్చాయి. దీని వల్ల నీరు భూమిలోకి ఇంకిపోవడం లేదా.. లీక్ కావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విషయం తెలుసుకున్న బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్డీఎస్ కాలువలో జరుగుతున్న పూడికతీత పనుల తీరును తప్పుబట్టారు.

3 ఇంచుల CC లైనింగ్ ఉన్న RDS కాలువలో 13 టన్నుల బరువు కలిగిన 200 L&T మిషన్తో పూడికతీస్తున్నారని మండిపడ్డారు. ఇంత పలచగా ఉన్న CC లైనింగ్‌పై అంత పెద్ద మిషన్ ఎక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కాలువలో పూడిక తీయటమేమోకాని ఉన్న CC లైనింగ్ అంత పగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. KCR పాలనలో అలంపూర్‌కి మేలు చెయ్యకపోయినా పర్వలేదు కాని, కీడు మాత్రం చేయకండని సూచిస్తూ ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed