దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలి.. జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌తో బీఆర్ఎస్ బృందం భేటీ

by Ramesh Naini |   (  Updated:2026-06-09 17:27:45  IST  )

దళిత క్రిష్టియన్లకు షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) హోదా కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

దళిత క్రిష్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలి.. జస్టిస్ కేజీ బాలకృష్ణన్‌తో బీఆర్ఎస్ బృందం భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దళిత క్రిష్టియన్లకు షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్సీ) హోదా కల్పించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం జాతీయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కేజీబాలకృష్ణన్‌తో ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో భేటీ అయింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను కమిషన్ చైర్మన్‌కు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ తదితర ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం అందజేసింది.

Next Story