మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు

by Disha Web Desk 12 |
మహిళా బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ లో మహిళా బిల్లుకు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని ఎంపీ కేశవరావు స్పష్టం చేశారు. బిల్లు ఇప్పటికైనా ఆమోదం పొందాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లుతో పాటు, బీసీ మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. 2010 లో కూడా ఇదే సమస్య వచ్చిందని, కానీ బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నందున ఆమోదించాలని కోరారు. కొన్ని పార్టీలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా.. ఏ పార్టీ అయినా, పెత్తనం ఉన్న చోట బీసీలను అణిచి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీసీలకు ప్రాధాన్యత కల్పించడంలో బీఆర్ఎస్ కొంత బెటర్ అన్నారు. ఓబీసీలకు 33శాతం అంశంపై సైతం పార్లమెంటులో ఎంపీలు పట్టుబడతారన్నారు. మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవితనే కాదు ఎందరో ఉద్యమం చేశారని, కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం బిల్లు కోసం కొట్లాడిందని స్పష్టం చేశారు. మహిళా నాయకురాలిగా కవిత ఉద్యమం చేస్తోందన్నారు. ఎన్నికల్లో బీసీలకు సీట్ల గురించి అన్ని పార్టీలు ఒకే వైఖరితో ఉన్నాయని బీసీలంతా పోరాట పంథా మార్చి పోరాడాలని పిలుపు నిచ్చారు. పార్టీలు చెప్పిందే చేయాలని, మాట మార్చొద్దని విజ్ఞప్తి చేశారు.


Next Story

Most Viewed