పవర్ లేని పార్టీ అధ్యక్షులు!

by Disha Web Desk 21 |
పవర్ లేని పార్టీ అధ్యక్షులు!
X

దిశ, కరీంనగర్​ బ్యూరో: బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షులకు పవర్స్​ ఉన్నట్లా..? లేనట్లా..? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. వాళ్లు పేరుకే జిల్లా అధ్యక్షులా..? ఫవర్స్​ మొత్తం పార్టీ హైకమాండ్​ వద్దేనా అంటే చాలా మంది అవుననే అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజవర్గంలో బీఆర్​ఎస్​ పార్టీలో గ్రూపు తగదాలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలు ప్రజల్లో మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేపై సైతం వ్యతిరేకంగా కామెంట్స్​ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్​ నాకే వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలో కొందరు పార్టీకి నష్టం వచ్చే విధంగా వ్యవరించినప్పటికీ వారిపై ఎక్కడా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పేరుకే జిల్లా అధ్యక్షులు కానీ వారికి ఎటువంటి పవర్స్ లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికార బీఆర్​ఎస్​ పార్టీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్​ ఆశీస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం మినహయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టికెట్​ ఆశిస్తున్న వారు ముగ్గురి నుంచి నలుగురి వరకు ఉన్నారు. నియోజకవర్గంలో ఉనికి చాటుకోవడానికి టికెట్​ ఆశిస్తున్న వారు వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి ముందుకు సాగుతున్నారు. వివిధ సందర్భాల్లో పార్టీ కార్యక్రమాలు సైతం గ్రూపులుగా విడిపోయి చేస్తున్నారు. ఈక్రమంలో ప్రత్యేక గ్రూపుగా ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. ప్రజల్లో మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకోవడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేపై సైతం వ్యతిరేకంగా కామెంట్స్​ చేస్తున్నారు. సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్​ నాకే వస్తుందనే అవకాశాలు ఉన్నాయంటూ బాహాటంగానే చెప్పుకుంటున్నారు.

వర్గాలుగా చీలిపోతున్న పార్టీ

నియోజకవర్గాల్లో బీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యే టికెట్​ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువ కావడంతో ప్రతి నియోజకవర్గంలో రెండు, మూడు వర్గాలుగా చీలిపోయింది. పార్టీ కార్యకర్తలు తమకు నచ్చిన నాయుకుడి వద్దకు చేరి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో ఒక పార్టీలో రెండు, మూడు గ్రూపులు ఉండడంతో కొందరు కార్యకర్తలు ఎవరి వెంట తిరిగితే ఏమీ అవుతుందో తెలియక సతమతం అవుతున్నారు. ప్రస్తుత సిట్టింగ్​ ఎమ్మెల్యేలపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేయాల్సింది పోయి అధికార పార్టీ నేతలే విమర్శలు గుప్పించడం విశేషం.

పేరుకే అధ్యక్షులా..?

కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత చాలా కసరత్తు అనంతరం బీఆర్​ఎస్​ పార్టీకి జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. కేవలం అధ్యక్షులను మాత్రమే ఎంపిక చేసి పార్టీ అధిష్టానం కార్యవర్గాన్ని ప్రకటించలేదు. జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగి దాదాపు ఏడాది గడుస్తుంది. అయితే వారి పని తీరులో ఎక్కడా అధ్యక్షుల మార్క్​ కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్న వారికి షోకాజ్​ నోటిసులు జారీ చేయడం, వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని మందలించడం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం వంటి ఘటనలు ఎక్కడ జరగడం లేదు. బీఆర్​ఎస్​ పార్టీ అధ్యక్షులు ఎవ్వరిపై చర్యలు తీసుకోకపోవడంతో అధ్యక్షులకు ఎటువంటి పవర్స్​ లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



Next Story

Most Viewed