ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో సెన్సేషనల్ షాక్.. కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన MLC

by Disha Web Desk 2 |
ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో సెన్సేషనల్ షాక్.. కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన MLC
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. తాజాగా మరో షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మె్ల్సీ బస్వరాజు సారయ్య కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లారు. గురువారం అనూహ్యంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సురేందర్ తనకు రాజకీయ గురువుగా పేర్కొన్నారు. అంతకుమందు కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రఘురాం నామినేషన్ ర్యాలీలోనూ పాల్గొని స్థానిక బీఆర్ఎస్ శ్రేణులకు మింగుడుపడని షాకిచ్చారు.


దీంతో సారయ్య దాదాపు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పినట్లే అని స్థానికంగా చర్చ మొదలైంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే(భద్రాచలం) తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. దీని నుంచి బీఆర్ఎస్ అధిష్టానం ఇంకా కోలుకోకముందే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ.. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొనడం స్థానికంగా కలకలం రేపుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story

Most Viewed