బీఆర్ఎస్‌కు మరో BIG షాక్.. కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న MLA

by GSrikanth |
బీఆర్ఎస్‌కు మరో BIG షాక్.. కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న MLA
X

దిశ, వెబ్‌డెస్క్/ఇల్లందు: భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వ్యవహారం చర్చనీయాంశమైంది. అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు. గతకొన్ని రోజులుగా వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరుతాడని వార్తలు వినిపించాయి. ఆ వార్తలకు ఆజ్యం పోసేలా ఆయన ఇవాళ మంత్రి తుమ్మల నిర్వహించిన సమావేశంలో పాల్గొనడంతో చేరిక దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన చేరికకు ముహూర్తం ఖరారైందంటూ ఆయన ముఖ్య అనుచరుల ద్వారా తెలిసింది. మంగళవారం ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్‌లో అధికారికంగా చేరడానికి ముందే తెల్లం వెంకట్రావు సమావేశాల్లో పాల్గొనడం ఆసక్తిగా మారింది.




Advertisement

Next Story