రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో ఔరంగజేబులు లేరని.. అలాంటి వారంతా కాంగ్రెస్‌లోనే ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అబబ్ధాలు ఆడడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఇలాంటి వారిని పాతాలాజికల్ లయర్ అంటారని ఎద్దేవా చేశారు. హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. ఆ విషయం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌లో ఏక్ నాథ్ షిండే అయ్యేదే రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్ ఎన్నికలు అయిన వెంటనే.. ఆరు నెలలలోపు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్తాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉద్యోగాలను భర్తీ చేస్తోందనే లెవెల్‌లో బిల్డప్ కొడుతున్నారని విమర్శించారు. ముందు ఇచ్చిన గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలని సూచించారు. రెండు గ్యారంటీలు అమలు చేసి మిగతా వాటిని అమలు చేయలేక చేతులెత్తేశారని అన్నారు.

Next Story